ఓబుళాపురంపై రాష్ట్రపతికి రాస్తా: గవర్నర్

ND Tiwari
హైదరాబాద్: ఓబుళాపురం గనుల వ్యవహారంపై అఖిల పక్షం తనకు ఫిర్యాదు చేసిన వివరాలతో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు, ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖలు రాస్తానని రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ హామీ ఇచ్చారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అఖిల పక్ష ప్రతినిది బృందం బుధవారం గవర్నరుకు ఫిర్యాదు చేసింది. ఓబుళాపురం గనుల వ్యవహారంపై సిబిఐ విచారణ కంటి తుడుపు చర్యేనని చంద్రబాబు మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓబుళాపురం గనుల లీజులు రద్దు చేయకండా ఇతర చట్టపరమైన చర్యలు చేపట్టకుండా సిబిఐకి అప్పగించడం వల్ల ఫలితం ఉండదని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అక్రమంగా లైసెన్సులు ఇచ్చిన అధికారుల వ్యవహారాన్ని కూడా సిబిఐ దర్యాప్తు పరిధిలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లీజులు రద్దు చేయాలని, ఓబుళాపురం వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లన్నీ శాససనభా స్పీకర్ వద్ద ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి తమ సూచనలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై గవర్నర్ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని నమ్ముతున్నట్లు లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, దేశ ప్రజాస్వామ్య సమస్య అని ఆయన అన్నారు. ఓబుళాపురంపై సిబిఐ దర్యాప్తు ముఖ్యమంత్రి రోశయ్య నాభి నుంచి వచ్చింది కాదని, నోటి నుంచి వచ్చింది మాత్రమేనని సిపిఐ నాయకుడు కె. నారాయణ వ్యాఖ్యానించారు. ఓబుళాపురం గను లీజును రద్దు చేయకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం సరి కాదని సిపిఎం నాయకుడు మధు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+