అనంతపురం: సినీ నటుడు బాలకృష్ణపై గురువారం ధర్మవరం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ కోడ్‌ను ఉల్లంఘించడంపై స్థానిక పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. దీనితో బాలకృష్ణను అరెస్టు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే ఆయన అందుబాటులో లేరని పోలీసులు కోర్టుకు సమాధానం ఇవ్వడంతో కోర్టు మొదట స్వయంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేసి, ఆఖరుకు ఈ రోజు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇటువంటి నాన్ బెయిల బుల్ వారెంట్లు గతంలో చాలా మంది రాజకీయ నాయకులపై దాఖలయ్యాయి.