వైయస్ జగన్ కేం సంబంధం లేదు: రోశయ్య

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ పాల్గొనే విషయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని, తనకు ఏ విధమైన ఇబ్బందీ లేదని ఆయన చెప్పారు. మంత్రులు ఎంత మంది ఉన్నారనేది ముఖ్యం కాదని, ఎంత బాగా పనిచేస్తున్నారనేది ముఖ్యమని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులందరూ తన పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications