త్వరలోనే ముఖ్యమంత్రిని అవుతా: జగన్

ఆయన తన ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై ప్రధానంగా విమర్శానాస్త్రాలు సంధించారు. నిజం చెప్తే తల పగిలిపోతుందని చంద్రబాబుకు ముని శాపం ఉందని, అందువల్ల చంద్రబాబు ఎప్పుడూ నిజం మాట్లాడరని ఆయన అన్నారు. విశ్వసనీయత లేని చంద్రబాబు మాటలు నమ్మవద్దని ఆయన వోటర్లకు పిలుపునిచ్చారు. తన తండ్రి వంటి నాయకుడు మరొకరు లేరని, నాయకుడంటే రాజశేఖర రెడ్డిలా ఉండాలని ఆయన అన్నారు. జగన్ తీరు వైయస్ రాజశేఖర రెడ్డిని తలపించిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హావభావాల తీరు, ప్రసంగం తీరు వైయస్ రాజశేఖర రెడ్డిని చూసినట్లుగా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications