కెసిఆర్ ను ఆస్పత్రికి తరలించండి: కవిత

కాగా, కెసిఆర్ కుమారుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామారావు వరంగల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన బెయిల్ తీసుకోవడానికి నిరాకరించారు. కెసిఆర్ ను విడుదల చేసే వరకు అన్నపానీయాలు ముట్టబోనని ఆయన చెప్పారు. అత్మహత్యలకు పాల్పడవద్దని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ జయశంకర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఆత్మత్యాగాలు చేయాల్సి వస్తే తమ తరంవారిమి చేస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, కెసిఆర్ ను చూడడానికి తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, రవీందర్ రెడ్డి ఖమ్మం బయలుదేరి వెళ్లారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని హరీష్ రావు కూడా విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ ను ఖమ్మం జైలులో నిర్బంధించడంపై కోర్టులో దాఖలైన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తన నిర్ణయాన్ని రేపటికి (మంగళవారానికి) వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications