రెండో కోణమేదీ: కెసిఆర్ దీక్షపై మందకృష్ణ

Manda Krishna Madigha
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దీక్ష విరమణ విషయంలో రెండో కోణాన్ని వెల్లడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సాక్షి టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మంగళవారం ఆ డిమాండ్ చేశారు. కెసిఆర్ పండ్ల రసం తీసుకుంటున్న దృశ్యాలను మాత్రమే మీడియా చూపించిందని, సెలైన్ ఎక్కించుకోవడానికి కెసిఆర్ అర గంట సేపు ప్రతిఘటించిన దృశ్యాలను ఎందుకు చూపించలేదని ఆయన అన్నారు. తాను అరగంట పాటు సెలైన్ ఎక్కించుకోవడానికి నిరాకరించానని, బలవంతంగా తనకు సెలైన్ ఎక్కించారని కెసిఆర్ అంటున్నారని ఆయన గుర్తు చేశారు.

బలవంతంగా సెలైన్ ఎక్కించిన తర్వాత దీక్ష భగ్నమైనట్లేనని, ఆ తర్వాత కూడా పండ్ల రసం తీసుకోకపోతే కెసిఆర్ నైతికత మీద ప్రశ్నతలెత్తుతుందని, పండ్ల రసం తీసుకోకపోవడంలో అర్థం లేదని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రతిఘటించిన విషయం నిజమా, కాదా ప్రభుత్వం బయట పెట్టాలని ఆయన అన్నారు. కెసిఆర్ పండ్ల రసం తీసుకుంటున్న దృశ్యం చూసిన తర్వాత షరతులేవీ లేకుండా దీక్ష విరమించారనే అనుమానాలు తలెత్తుతున్నాయని, కేసిఆర్ ప్రతిఘటించిన దృశ్యాలు లేకపోవడం వల్ల ఈ అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం ఎప్పుడూ కాదని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమైతే తనకు వర్గీకరణ ముఖ్యమైందని ఆయన చెప్పారు. కెసిఆర్ లోని దొరల లక్షణాన్నే తాను గతంలో తప్పు పట్టానని, తెలంగాణకు వ్యతిరేకంగా తాము ఎప్పుడూ లేమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+