నిలకడగా కె చంద్రశేఖర రావు ఆరోగ్యం: సబితా ఇంద్రారెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఆరోగ్యం నిలకగడగా ఉందని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు, నేతల కోరిక మేరకే కెసిఆర్ ను హైదరాబాదుకు తరలించామని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కెసిఅర్ కోరితే బెయిల్ కోసం ప్రయత్నిస్తామని ఆమె చెప్పారు.
కెసిఆర్ 14 రోజుల పాటు జ్యుడిషయల్ రిమాండ్ లో ఉన్నందున కెసిఆర్ ఆరోగ్యాన్ని ప్రతి క్షణం సమీక్షిన్తున్నట్లు ఆమె తెలిపారు. కెసిఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు ఆయనను నిమ్స్ లోని మిలీనియం బ్లాక్ 228 గదికి మార్చారు. కెసిఆర్ కు తీవ్రంగా జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది. బ్లడ్ ప్రెషర్ సమస్య కూడా తలెత్తింది.