తెలంగాణతో బంధం కొత్తదేం కాదు..! ఆ గొంతుకలు..పవన్ కామెంట్స్..!

జనసేన పార్టీని తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ లోనే స్థాపించామని, తెలంగాణ మీద తమ పార్టీకి ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. తన చుట్టు పక్కల ఉన్న నాయకులంతా 2007-08 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న నాయకులే అన్నారు. ఈ రోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ తనది కాదన్నారు. తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాక ముందే ఇక్కడి సంస్కృతి, పోరాట స్ఫూర్తి నుంచి ఉత్తేజం పొందామని, సినిమాలు, సంస్కృతి పరంగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నామన్నారు. ఇవాళ తమను విమర్శించే గొంతులు 2007లో లేవన్నారు. తాను తెలంగాణ నలుమూలలా పెరిగిన వాడిని, వెళ్లిన వాడిని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని కార్పోరేషన్లలో మువ్వన్నెల జెండా తాము ఎగురవేశామన్నారు. ఇది కొత్తగా వచ్చిన ప్రేమ కాదన్నారు.

Pawan Kalyan to Telangana people My Love Is Not New Recalls Long Association Amid Today s Protests

ఆదిలాబాద్ జిల్లాల్లో, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు తనను విమర్శిస్తున్న నాయకులు ఎప్పుడూ తిరగలేదన్నారు. ఆదిలాబాద్ గోండు తండాల్లో, గెలుస్తానో లేదో తిరగని పరిస్ధితుల్లో తాను తిరిగామన్నారు. ఓట్లు పడతాయని కాదని, తనకు తెలంగాణ అంటే ఇష్టమన్నారు. తెలంగాణపై తనకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదని, విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. సామాజిక తెలంగాణలో అన్ని కులాలు బాగుండాలని చెప్పి మరీ వచ్చామన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ, ఆంధ్రను విభజించిన తీరు తప్పని మాత్రమే చెప్పానన్నారు. తెలంగాణ సంస్కృతీ, ఇక్కడి ప్రజలకు ఎప్పుడూ తాను వ్యతిరేకం కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+