ఉస్మానియాలో పోలీసులు: ఉద్రిక్తత

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. తక్షణమే ఉస్మానియా నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని జెఎసి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు బలగాలకు వ్యతిరేకంగా ఆర్ట్ర్ కళాశాల వెలుపల విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల లోగా పోలీసు బలగాలను ఉపసంహరించాలని జెఎసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వ తీరుపై ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. విద్యార్థులపై అణచి వేత చర్యలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.