లగడపాటి రాజీనామా: భగ్గుమన్న ఆంద్రా ఎంపీలు

తెలంగాణపై ఆంధ్రా ఎంపిలు బుధవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ వద్ద తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని వారు వీరప్ప మొయిలీకి చెప్పారు. వీరంతా తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారు. చిదంబరం ప్రకటన వెలువడగానే ఆంధ్రా ఎంపీలు తీవ్ర అసంతృప్తితో మంతనాలు ప్రారంభించారు. గురువారం పార్లమెంటు ఆవరణలో కాంగ్రెసు ఆంధ్రా ఎంపీలు సమావేశమయ్యారు. తాము చర్చలు జరుపుతున్నామని, మధ్యాహ్నం ఈ విషయంపై మాట్లాడుతామని రాయపాటి సాంబశివ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications