వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు న్యాయవాదుల ఆంధ్ర- తెలంగాణ ఘర్షణ

By Santaram
|
Google Oneindia TeluguNews

High Court Lawyers
హైదరాబాద్‌: హైకోర్టులో శుక్రవారం న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోర్టు ఆవరణలో సమైక్యాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణ తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు గేట్లు మూసివేశారు.

గుంటూరు జిల్లా, తెనాలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్రాకు మద్ధతుగా మాచర్ల రైల్వే స్టేషన్‌లో ఆర్యవైశ్యుల రైల్‌రోకో చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూడాలని ముఖ్యమంత్రి రోశయ్య ప్రజలకు విన్నవించుకున్నారు.

రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా, శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్రం ఆందోళనలకు నిలయమనే భావన తొలగిద్దాం అని ఆయన నేతలను కోరారు. రాష్ట్రంలో శాంతి వాతావరణం నెలకొల్పడానికి అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీకి అల్లర్లు ప్రేరేపించాలని ఉండదని..అన్ని పార్టీలు కలిసి శాంతి ప్రకటన చేయాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X