హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం హైదరాబాదులో హై డ్రామా నడిపించారు. క్షణక్షణం ఉత్కంఠభరితమైన వాతావారణంలో ఆయనను సోమవారం అర్థరాత్రి ప్రాంతంలో పోలీసులు హైదరాబాదులోని జూబిలీహిల్స్ లోని ఇంటికి చేర్చారు. రాజీనామా చేసిన కాంగ్రెసు శాసనసభ్యులతో సమావేశమైన తర్వాత ఆయన నాటకీయంగా ఎల్పీ స్టేడియానికి వచ్చి అక్కడ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయనతో పాటు 16 మంది శాసనసభ్యులు కూర్చున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్కడికి పోలీసులు పెద్ద యెత్తున చేరుకుని లగడపాటి రాజగోపాల్ ను అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులను శాసనసభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, శాసనసభ్యులకు మధ్య తోపులాట జరిగింది. శాసనసభ్యుడు కాటసాని కింద పడిపోయారు. ఆయనను లేపి వ్యానులో ఎక్కించారు. ఆ తర్వాత లగడపాటిని విజయవాడ వైపు తీసికెళ్లారు. కానీ ఆ తర్వాత వాహనాన్ని హైదరాబాదు వైపు మళ్లించి జూబిలీహిల్స్ లోని ఆయన ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం నుంచి లగడపాటి హైదరాబాదులోని డ్రామా నడిపిస్తూనే ఉన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి