హైదరాబాద్: సినీ నటులు మోహన్ బాబు, చిరంజీవిలకు ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా బాసటగా నిలిచారు. వైఖరి మార్చుకున్నందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ప్రశ్నించవచ్చునని, అయితే చిరంజీవి పిల్లల సినిమాలను అడ్డుకోవడం, వాటిని ధ్వంసం చేయడం సరి కాదని ఆయన అన్నారు. కలిసి ఉందామనే మంచి మాట చెప్పినందుకు మోహన్ బాబు కుమారుడి సినిమాను అడ్డుకుంటున్నారని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సినిమా వేరు, రాజకీయం వేరని, కళను రాజకీయాలతో ముడి పెట్ట కూడదని ఆమె అన్నారు. తెలంగాణలో కళాకారులకు ఎంతో గౌరవం ఉందని ఆయన అన్నారు. వేర్పాటువాదులు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి బలహీన పరచాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. మన రాష్ట్రం బలమైంది కాబట్టే, మన రాష్ట్ర ఎంపీల వల్లనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టే చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.
తెలంగాణ మాత్రమే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా వెనకబడి ఉన్నాయని, ప్రజాప్రతినిధులందరూ కూర్చుని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణను ఇన్నాళ్లు అభివృద్ధి చేసి ఉంటే ఈ సమస్య అభివృద్ధి చెంది ఉండేదని అంటూనే అందరం కలిసి ఉంటే అభివృద్ధి చెందుతామని ఆమె అన్నారు. మూడు ప్రాంతాలు కూడా కవలలాంటివని ఆమె అన్నారు. కలిసి ఉండి రాష్ట్రానికి ఎంతో గుర్తింపు తెచ్చామని, కలిసి ఉన్నాం కాబట్టే విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి