తెలంగాణ కోసం ఉద్యమిస్తాం: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం తాము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, ఉద్యమాలు చేస్తామని తెలుగుదేశం తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యులతో చర్చించి తదుపరి కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వరంగల్ లో చెప్పారు. కాంగ్రెసు నేతలు లగడపాటి, వైయస్ జగన్, కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమం సాగుతోందని ఆయన విమర్శించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినవారిపై చర్యలకు ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర నినాదంతో రాజీనామాలు చేసిన అశోక్ గజపతిరాజు వంటి కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యులు చిత్తశుద్ధి వుంటే క్వార్టర్స్ ను ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియపై ప్రకటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి కె. రోశయ్య సమైక్యాంధ్ర గురించి మాట్లాడడం సమంజసం కాదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్ లో అన్నారు. తెలంగాణ తీర్మానంపై రోశయ్య రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో వెంటనే తీర్మానం ప్రతిపాదించాలని, లేకుంటే తాము భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ వాదం ప్రతి చోటా బలపడిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+