విజయవాడ: హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) కు తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడాన్ని తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు తప్పుగా భావించారని మంత్రి పార్థసారథి అన్నారు. జిల్లా కలెక్టర్ పియూష్ కుమార్, విజయవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాదులోని ప్రత్యేక పరిస్థితుల వల్ల, శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చుననే సమాచారం ఉండడం వల్ల లగడపాటిని నిమ్స్ కు తరలించడానికి ప్రభుత్వం విముఖ చూపుతోందని, విజయవాడలో లగడపాటికి చికిత్స అందించేందుకు అన్ని వసతులూ ఉన్నాయని ఆయన అన్నారు. నిమ్స్ కు లగడపాటిని తరలించకూడదనే నిర్ణయంలో తెలంగాణ, ఆంధ్ర తేడా లేదని ఆయన చెప్పారు.
ప్రస్తుత స్థితిపై పార్థసారథి ముఖ్యమంత్రి కె.రోశయ్యతో ఫోన్ లో మాట్లాడడారు. లగడపాటిని నిమ్స్ కు తరలించడానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్లు పార్థసారథి చెప్పారు. లగడపాటిని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, అందుకు తాము ఏర్పాట్లు చేశామని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అయితే కోర్టు ఆదేశాలు వచ్చే వరకు నిరీక్షించాలని లగడపాటి చెప్పడంతో జాప్యం జరిగిందని, ఈలోగా అకస్మాత్తుగా వెళ్లిపోయారని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి