హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అదృశ్యంపై రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ ను ఆదేశించారు. లగడపాటి అదృశ్యం వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించి అందించాలని ఆమె ఆదేశించారు. లగడపాటి అదృశ్యంపై సంబంధిత అధికారుల సస్పెన్షన్ కు డిజిపి ఆదేశాలు జారీ చేశారు.
రాజగోపాల్ కోసం అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. రాజమండ్రిలో కూడా ఆయన కోసం గాలిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి మంగళగిరిలోని ఎన్నారై అస్పత్రికి తరలించడానికి గంట ముందు ఆయన విజయవాడ ఆస్పత్రి నుంచి మాయమయ్యారు. అంతకు ముందే తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావును ఎన్నారై ఆస్పత్రిలోని అత్యవసర సేవా విభాగానికి తరలించారు. లగడపాటి అదృశ్యం నేపథ్యంలో విజయవాడలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయనపై 309 కేసు నమోదు చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి