లగడపాటిని నిమ్స్ నుంచి తరలిస్తారా?

కాగా, లగడపాటి రాజగోపాల్ రావడంతో నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లగడపాటికి వ్యతిరేకంగా తెలంగాణవాదులు నినాదాలు చేశారు. లగడపాటి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో నిమ్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమ్స్ వద్ద భద్రతా బాధ్యతలను ఐపియస్ అధికారి సురేంద్రబాబుకు అప్పగించారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే లగడపాటి హైదరాబాదుకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఆయనను నిమ్స్ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని కాంగ్రెసు తెలంగాణ నాయకులు కూడా కోరుతున్నారు. పైగా, వైయస్ వివేకానందరెడ్డి, దేవినేని ఉమా మహేశ్వర రావులాంటి సమైక్యాంధ్ర ఆందోళనకారులను కూడా నిమ్స్ కు తరలించాలనే డిమాండ్ వస్తోంది. దీంతో లడపాటిని మరో ప్రాంతానికి తరలించడమే భద్రతా కారణాల రీత్యా మంచిదనే భావన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications