ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్.. సోషల్ మీడియా షేక్.. ఎందుకో తెలుసా..?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే తమిళనాడు సీఎం దళపతి విజయ్ ఒకే వేదికపై సందడి చేశారు. జగన్ బంధువు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయా రెడ్డి వివాహం తమిళనాడు రాజధాని చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో వైఎస్ జగన్, సీఎం విజయ్, కేటీఆర్ పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకకు సీఎం విజయ్, నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ దంపతులు.. వేదికపైకి వెళ్లి నూతన వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందమయంగా, సుఖసంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఇక ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, వైఎస్ షర్మిల, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్, సీఎం విజయ్, కేటీఆర్ లు ఒకే వేదికను పంచుకున్నారు. ఒకర్నొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక స్టేజ్ ‏పై నూతన వధూవరులతో ముగ్గురు కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ ను టీవీకే, వైసీపీతో పాటు బీఆర్ ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Jagan CM Vijay KTR on the same platform attend the wedding ceremony of YS Anil daughter in Chennai

మరోవైపు తమిళనాడు సీఎం విజయ్ తో పాటు సినీ నటి త్రిష కూడా ఈ వివాహ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇప్పటికే విజయ్- త్రిష కు సంబంధించి రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వివాహ వేడుకకు హాజరు కావడంతో వీరిద్దరి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+