Sai Durga Tej: మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఎంగేజ్ మెంట్ ఫొటో వైరల్.. వధువు ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మెగా హీరో సాయి దుర్గ తేజ్. అయితే తాజాగా సాయి దుర్గ తేజ్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి నిశ్చితార్థం నవంబర్ 5న గురువారం హైదరాబాద్ లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ కు అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తరలివచ్చి కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సాయి దుర్గా తేజ్, కిరణ్మయిల వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్ లో జరగనుంది.
మరోవైపు సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం ఫొటోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటోలో దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం ఉంది. ఇక ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ 'సంబరాల యేటి గట్టు' అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ సిద్ధం అవుతోంది.

ఇక 2014 లో పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో వరుస హిట్స్ కొట్టారు. ఆ తర్వాత విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ సినిమాలతో వరుస ప్లాఫ్ లు తగిలినా 2019 లో చిత్ర లహరి సినిమాతో మరోసారి ట్రాక్ లోకి వచ్చారు. ఆ తర్వాత ప్రతిరోజూ పండగే, విరూపాక్ష సినిమాలతో హిట్స్ అందుకున్నారు సాయి దుర్గ తేజ్. ఇక తాజాగా సాయి దుర్గ తేజ్ ఎంగేజ్ మెంట్ పూర్తి కావడంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఫ్యాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications
