హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం తాజాగా ప్రకటన తీరు బాగా లేదని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. ఎక్కువ మంది తెలంగాణేతర శాసనసభ్యులు ఉన్నప్పుడు తెలంగాణకు అనుకూలంగా శాసనసభలో ఎలా నిర్ణయం వస్తుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యలకు ఇచ్చిన ప్రాధాన్యం కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ పార్లమెంటు సభ్యులకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. సీమాంధ్ర, తెలంగాణ పార్లమెంటు సభ్యులను ఒక్క చోట కూర్చో బెట్టి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాల్సి ఉండిందని, కానీ అలా చేయలేదని ఆయన అన్నారు.
ఆంధ్రావారు తిరిగి తమ మీద అధికారం చెలాయిస్తారనే అభిప్రాయం తెలంగాణవారిలో ఏర్పడిందని ఆయన అన్నారు. అంధ్రవారు తెలంగాణవారి బాగోగులు చూడరనే అభిప్రాయం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రావారి చెప్పుచేతుల్లో తెలంగాణవారు ఉండాలనే విధంగా పార్టీ అధిష్టానం వ్యవహరించిందని ఆయన అన్నారు. ఆ అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో వచ్చిందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి