ఈ కోడికూర తింటే మూడేళ్ళు జైలుశిక్ష!

మన తెలుగు వంటల్లో చికెన్ కూరకు ప్రత్యేక స్థానం ఉంది. పండగలైనా, శుభాకార్యాలైనా ఏదైనా సరే చికెన్ ఉండాల్సిందే . అయితే ఈ కోడికూర తింటే అనవసరపు రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడేళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అడవి కోడి లేదా జంగ్లీ ముర్గా అని పిలువబడే ఈ కోడి సాధారణ గ్రామాల కోడి కాదు. ఇది ప్రధానంగా అడవుల్లోనే నివసిస్తుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవుల్లో కోళ్ళు

బూడిద రంగులో ఉండే ఈ కోళ్ళు నేలపై తిరుగుతూ గింజలు, చెదలు, కీటకాలు తిని జీవిస్తాయి. ఏదైనా అలికిడి వినిపిస్తే వెంటనే చెట్లపైకి ఎగురుతాయి. భారతదేశంలోని అనేక అటవీ ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవుల్లో కూడా ఈ అడవి కోళ్లు ఉన్నాయి. ఈ అడవి కోడిని వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద రక్షిత జాతిగా ప్రకటించారు.

Grey Jungle Fowl Hunting or consuming can land you in prison for up to 3 years under the Wildlife Protection Act

వీటి వేట నిషేధం

దీన్ని వేటాడడం, పట్టుకోవడం, చంపడం, మాంసం నిల్వ ఉంచడం లేదా విక్రయించడం అన్నీ చట్టవిరుద్ధం. ఈ నేరం నిరూపితమైతే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా కూడా విధించవచ్చు. కేసు తీవ్రత బట్టి శిక్ష మారవచ్చు. అడవి కోళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అడవుల నరికివేత, అక్రమవేట వలన ఈ జాతి అంతరించి పోయే ప్రమాదం ఉంది. ప్రకృతి సమతౌల్యంలో ఈ కోళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి.

వీటిని వేటాడినా,బాధ పెట్టినా చట్ట విరుద్ధం

అడవి కోళ్ళు ఆహార గొలుసులో భాగం కావడం వల్ల వాటి సంరక్షణ అవసరం. ప్రభుత్వం పర్యావరణ సంరక్షణ కోసం ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అడవుల్లో ఇలాంటి వన్యప్రాణులు కనిపిస్తే వాటికి ఎలాంటి హాని చేయకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు తీయాలనే ఆసక్తితో కూడా వేటాడటం లేదా బాధపెట్టడం చట్టవిరుద్ధం.

భారత్ లో రైతులపై ఎరువుల ధరల పిడుగు.. కారణం ఇదే!
భారత్ లో రైతులపై ఎరువుల ధరల పిడుగు.. కారణం ఇదే!

రక్షిత జాతిలో అడవి కోడి

మనం తినే చికెన్ సాధారణంగా ఫామ్‌లలో పెంచినవి. కానీ అడవి కోడి పూర్తిగా వన్యప్రాణి. దీన్ని గుర్తించి సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా చెప్తూ ఈ కోళ్ళ వేట కొనసాగకుండా దీనిని రక్షిత జాతిలో చేర్చారు. . అందుకే ఈ కోడి కూర తినకూడదు. ఒకవేళ తిన్నారో మూడేళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+