హైదరాబాద్: తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరినికి నిరసనగా తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సామూహికంగా రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని తెలుగుదేశం సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం సభ్యులు 39 మంది ఉన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తమను భాగస్వాములను చేయలేదని, ఏకపక్షంగా ప్రకటనలు చేసిందని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణను కాంగ్రెసు పార్టీ మోసం చేస్తోందని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని తెలుగుదేశం మరో శానససభ్యుడు మండవ వెంకటేశ్వర రావు అన్నారు. 1969లో, 2004లో, 2009లో కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను దగా చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశాన్ని రాజకీయాలకు వాడుకునే దురుద్దేశంతో కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం శాసనసభ్యులు కొంత మంది రాజీనామాలు చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి