దాడి చేసింది వారి మనుషులే: జెఎసి

బయటి వ్యక్తులే తెలుగుదేశం నాయకులు దాడి చేశారని వారు ఆరోపించారు. నాగం జనార్దన్ రెడ్డిపై జరిగిన దాడిని ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ స్పష్టంగా ప్రసారం చేసింది.ఆ టీవీ క్లిప్పింగుల్లో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నాగం జనార్దన్ రెడ్డిపై దాడి చేస్తుండడం, రక్షణగా విద్యార్థులు వస్తుండడం ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ వీడియో క్లిప్పింగుల్లో స్పష్టంగా కనిపించింది. నాగంపై దాడి తర్వాత ఆ వ్యక్తే ఇతర తెలుగుదేశం నాయకులపైకి వెళ్లి దాడి చేయడం కనిపించింది. సంఘటనా స్థలంలో ఒక రివాల్వర్ లభించింది. అది తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావుదని తెలుస్తోంది. ఓయులోకి బయటి వ్యక్తులు రాకూడదని ఐజి అనురాధ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications