వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు కమిటీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రబుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆచరణలో పెట్టడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒక కసరత్తు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి చెందిన తెలంగాణ మంత్రులు ఢిల్లీలో లాబీయింగ్ జరుపుతున్న నేపథ్యంలో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఈ కమిటీలో ఇరు ప్రాంతాలకు చెందిన మేధావులు, ఐపియస్, ఐఎఎస్ అధికారులు ఉండవచ్చునని అంటున్నారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం నుంచి ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రక్రియపై ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీల మధ్య విస్తృతమైన చర్చలు జరిగినట్లు, ఆ చర్చల్లో ఆ మేరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని పిలిపించుకుని ఆ విషయంపై చర్యలకు పూనుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు.

ఆదివారంనాడు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. తగిన ప్రకటన వస్తుందని ప్రణబ్ హామీ ఇచ్చినట్లు వారు ఆదివారంనాడే చెప్పారు. కాగా, తాము ప్రణబ్ హామీతో సంతృప్తి చెంది రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు రాజీనామాలను ఉపసంహరించుకోబోమని వారు సోమవారం స్పష్టం చేశారు. వారు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. తమ మనోభావాలను అధిష్టానానికి విన్నవించేందుకు సహకరించాలని, తమకు నేతృత్వం వహించాలని వారు జైపాల్ రెడ్డిని కోరారు. అందుకు జైపాల్ రెడ్డి అంగీకరించినట్లు వారు తెలిపారు.

కాగా, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తన నివాసంలో రాష్ట్ర మంత్రులకు సోమవారం మధ్యాహ్నం విందు ఇచ్చారు. ఈ విందుకు రాష్ట్ర తెలంగాణ మంత్రులతో పాటు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. మరోవైపు జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు కూడా ఈ విందుకు రావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్న కోస్తాంధ్రలోని అమలాపురం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ రాష్ట్ర విభజన జరగాలా, వద్దా అనే విషయంపై కాకుండా రాష్ట్ర విభజనకు తీసుకోవాల్సిన చర్యలను చేపడుతుందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X