హైదరాబాద్: హైదరాబాద్ ఎవరి సొత్తూ కాదని, హైదరాబాద్ ఇక్కడ నివసించే ప్రజలందరిది అని రాష్ట్ర బిసి సంక్షేమ మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ పై రాయలసీమ ప్రాంతానికి చెందిన జెసి దివాకర్ రెడ్డి, తెలంగాణ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి మధ్య తీవ్ర వివాదంతో కూడిన వ్యాఖ్యలు చెలరేగిన నేపథ్యంలో ముఖేష్ గౌడ్ సోమవారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పై ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమై అభిప్రాయాలను సేకరించే సమయంలో హైదరాబాద్ వాసుల వైఖరిని తాము తెలియజేస్తామని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోి శాసనసభ్యులు, కార్పోరేటర్ల అభిప్రాయాలను కూడా రాష్ట్ర విభజన సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి గ్రేటర్ హైదరాబాద్ నేతలమంతా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి