నెల్లూరు రొట్టెల పండుగకు 2 లక్షల మంది
నెల్లూరు: మత సామరస్యా నికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగ ఘనంగా ప్రారంభమైంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచి తొలి రోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యారు. రొట్టెల మార్పిడిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. విద్యా రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతానం రొట్టె, వ్యాపారం రొట్టె, ఉద్యోగం రొట్టె, సౌభాగ్య రొట్టె తదితర రొట్టెలను సూచిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డులతో పాటు ఈ ఏడాది కొత్తగా సమైక్యాంధ్ర రొట్టె బోర్డును ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర అభిమానులు భారీ స్థాయిలో రొట్టెలను మార్చుకు న్నారు.
సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులు నేరుగా చెరువు వద్దకు వచ్చి తమకు మేలు చేకూర్చిన రొట్టెలను మార్చుకొని బారాషాహిద్ దర్గాను దర్శించుకున్నారు. అనంతరం భక్తులు కసుమూరు దర్గా, ఏఎస్‌పేట దర్గా, గొలగమూడి, పెంచలకోన, జొన్నవాడ తదితర పుణ్య క్షేత్రాలను సందర్శించారు. దీంతో ఆయా క్షేత్రా లలో కూడా భక్తుల రద్దీ పెరిగింది. ఈ పండుగ మూడు రోజుల పాటు జరుగుతుంది.
రొట్టెలు పట్టుకునేందుకు పాకిస్తాన్, సౌదీ అరేబియా భక్తులు కూడా హాజరై కోర్కెల రొట్టెలు పట్టుకుని దర్గాకు మొక్కుబడులు చెల్లిం చుకుని వెళ్ళారు. భక్తులకు సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే విష యాన్ని దర్గా ఉత్సవ కమిటితో పాటు నగర శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, మేయర్ భానుశ్రీ, నగర పాలక సంస్థ కమిషనర్ టీఎస్ ఆర్ ఆంజనేయులు, ఆర్డీవో వేణు గోపాల్‌రెడ్డి, తహసిల్దారు భక్తవత్సల రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఇతర శాఖల అధికారులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పర్యవేక్షిస్తున్నారు.