వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్డీ తివారీపై లీగల్ యాక్షన్: డిజిపి

తివారీపై కొందరు మహిళా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తివారీకి సెక్స్ కార్యకలపాలకు చెందిన టేప్ లను ఒక తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసింది. ఆ ప్రసారం జరిగిన వెంటనే ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేసి డెహ్రాడూన్ వెళ్లిపోయారు. తివారీపై న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి కూడా పోలీసు కమిషనర్ ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. తివారీపై అనైతిక మనుషలు రవాణా (నిరోధ) చట్టంలోని సెక్షన్ ఆరు కింద, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (అవమానకర ప్రవర్తన), సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసులు నమోదు చేయాలని ఆయన కమిషనర్ ను కోరారు.
రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినందున తివారీ రాజ్యాంగపరమైన హోదాలో లేరని, అందువల్ల తివారీపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద చర్యలు తీసుకోవచ్చునని ఆయన వాదించారు.