పునర్వసులోకి గురువు: మేషం, మిథునం, సింహం, ధనుస్సు రాశులకు అద్భుత లాభాలు

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే దేవగురువు బృహస్పతి, తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ నెల 14వ తేదీన గురుడు తన సొంత నక్షత్రమైన పునర్వసులో రెండో పాదం నుంచి మూడో పాదంలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య పరిభాషలో గురు గ్రహం నక్షత్ర సంచారం చేయడం అనేది అత్యంత కీలకమైన మార్పుగా భావిస్తారు. ఈ పరిణామం వల్ల కొన్ని రాశుల వారికి 'గురు బలం' రెట్టింపు అయ్యి, అదృష్టం వరించబోతోంది. వాటి వివరాలను తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో గురు బలం ఉంటే ఎలాంటి అసాధ్యమైన పనైనా సులభంగా మారుతుంది.

మేష రాశివారికి పదోన్నతులు, అద్భుత విజయాలు

మేష రాశి వారికి గురు గ్రహ సంచారం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. చాలా కాలంగా ప్రమోషన్లు లేదా జీతాల పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది అనువైన సమయం. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి ఆశించిన అవకాశాలు తలుపు తడతాయి. గతంలో వాయిదా పడిన లేదా ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. సౌకర్యవంతమైన జీవనానికి అవసరమైన వనరులు సమకూరుతాయి.

Horoscope Jupiter Enters Punarvasu Tremendous Gains for Aries Gemini Leo and Sagittarius

మిథున రాశి వారికి వ్యాపారంలో భారీ ఒప్పందాలు

పునర్వసు నక్షత్రం మూడో పాదంలోకి గురుడు రావడం వల్ల మిథున రాశి వారికి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కానుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాషా నైపుణ్యం, చాకచక్యం వల్ల ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు లేదా డీల్స్ కుదిరే అవకాశం ఉంది. సామాజిక హోదా పెరగడమే కాకుండా, ఆదాయ మార్గాలు కూడా మెరుగుపడతాయి.

సింహ రాశి వారి సృజనాత్మకతకు గుర్తింపు

సింహ రాశి వారికి గురు బలం తోడవ్వడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ సమయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆఫీసులో పై అధికారుల మద్దతు లభిస్తుంది. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించి, ఆర్థికంగా స్థిరపడతారు. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు.

ధనస్సు రాశి వారికి పోటీ పరీక్షల్లో విజయం

ధనస్సు రాశికి గురుడు అధిపతి కావడం వల్ల, ఈ నక్షత్ర మార్పు వీరికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో నెలకొన్న మనస్పర్థలు తొలగిపోయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఊహించని లాభాలు గడిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+