వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యేకాంధ్రతోనే అభివృద్ధి: హరిబాబు

మనరాష్ట్రంలో 42 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రం అభివృద్ధికి వారు సాధించిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఎంతమంది ఎంపీలు అన్నది కాదు, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిదనేదే ముఖ్యమన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారన్నారు. అమలాపురం ఎంపీ హర్షకుమార్, హరిరామజోగయ్య వంటి నాయకులు ప్రత్యేక ఆంధ్ర కావాలని చెబుతున్నారన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఏ మాటచెప్పినా దృఢంగా ఉండేదని, ఇప్పటి ప్రధాని మనోహ్మన్‌సింగ్, సోనియాగాంధీల మాటలకు పొంతన ఉండడం లేదన్నారు. తెలంగాణపై ఇప్పటికే రెండుసార్లు మాటలు మార్చారని, మూడోమాటకూడా చెబుతారని అన్నారు. బీజేపీ 1997 నుంచి ప్రత్యేక రాష్ట్ర అభిప్రాయాన్ని చెబుతోందన్నారు. చిన్నరాష్ట్రాల విభజనల వల్లే అభివృద్ధి సా«ధ్యమవుతుందన్నారు.