విశాఖపట్నం: రాష్ట్ర విభజన ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) తలపెట్టిన సమావేశాన్ని సమైక్యవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే లాభాలపై, నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బిజెపి గురువారం సమావేశాన్ని తలపెట్టింది. సమావేశం ప్రారంభం కాగానే సమైక్యాంధ్ర ఉద్యమకారులు వచ్చి బిజెపి నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో స్వల్ఫ ఘర్షణ, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.
సమావేశం జరుగుతున్న ఆవరణ గేట్లను సమైక్యాంధ్ర ఉద్యమకారులు ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. బిజెపి విజయవాడలో తలపెట్టిన సమావేశాన్ని ఇటీవల సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి