ఐటి కంపెనీల వద్ద భారీ పోలీసు భద్రత

ప్రజా రవాణా లేకపోవడంతో క్యాబ్స్, సొంత వాహనాల్లో ఆయా కంపెనీల ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చారు. కంపెనీల ప్రధాన ద్వారాల్లో ఉద్యోగుల గుర్తింపు కార్డులతో పాటు లగేజ్ బ్యాగ్‌లను పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. అటుగా వాహనాలపై వచ్చే వారి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని వెనక్కి పంపిస్తున్నారు.
రాయదుర్గం ఐటీ జోన్ పరిధిలో నానక్‌రామ్‌గూడ, విప్రో జంక్షన్, గౌలిదొడ్డి, ఐఎస్‌బీ చౌరస్తా, గచ్చిబౌలి జంక్షన్ తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఐటీ కంపెనీలకు వెళ్ళే క్యాబ్స్, ఉద్యోగుల సొంత వాహనాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బస్సులు తిరగక పోవడంతో ఐటీ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరు కాలేదని తెలిసింది. టీసీఎస్, రహేజా ఐటీ పార్కు, వెనెన్ ఐటీ పార్కు, ఇన్ఫోటెక్, సాఫ్ట్‌ప్రో, హెచ్‌ఎస్‌బీసీ, ఒరాకిల్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, పొలారిస్, సాఫ్ట్‌సోల్ తదితర కంపెనీలు యధావిధిగా పనిచేశాయి. ఆందోళనలు మరింత ఉధృతమైతే ఐటీ కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.