వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్జనకు పోలీసు అనుమతి అక్కర్లేదు: కెకె

By Pratap
|
Google Oneindia TeluguNews

K Kesava Rao
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసి 3వ తేదీన తలపెట్టిన మహా గర్జన సభకు పోలీసుల అనుమతి గానీ ప్రభుత్వం అనుమతి గానీ అవసరం లేదని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. విద్యార్థుల జెఎసి తమ మహా గర్జనను జరుపుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ న్యాయవాదుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తామని స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని కూడా ప్రకటించిందని ఆయన అన్నారు. ఫజల్ అలీ కమిషన్ నివేదిక అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని కూడా చెప్పిందని ఆయన అన్నారు. ఈ నెల 3వ తేదీన విద్యార్థుల జెఎసికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. వారిద్దరు శనివారం ముఖ్యమంత్రిని కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X