తెలంగాణపై కాంగ్రెసులో మాటల యుద్ధం

గాదె వెంకటరెడ్డి ప్రకటనపై కేశవరావు తీవ్రంగా మండి పడ్డారు. ఎన్నికల ప్రణాళికలోనూ యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలోనూ తెలంగాణ ప్రస్తావన ఉందని కేశవరావు అన్నారు. గాదె వెంకటరెడ్డి మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఎన్నో సార్లు కాంగ్రెసు తెలంగాణ ఇస్తామని చెప్పిందని ఆయన అన్నారు. వైయస్ కమిటీ ఏర్పాటు ప్రకటనకు క్రమంగా కాలం చెల్లిపోయిందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం గత 50 ఏళ్లలో ఇచ్చిన హామీలను ఎలా రాసిందీ ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications
