మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసముంటున్న భారతీయ యువకుడు ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. తను పనిచేసే చోటుకి వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతుడు పంబాబ్‌కు చెందిన నితిన్ గార్గ్(21)గా గుర్తించారు. హంగ్రీ జాక్స్ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న నితిన్‌ను దుండగులు కడుపులో కత్తితో పొడిచి హత్య చేశారు. ఆండర్సన్ స్ట్రీట్ నుంచి క్రూక్‌షాంక్ పార్క్ వైపు నడిచి వెళుతుండగా శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం ప్రకారం) దుండగలు ఈ దురాగతానికి ఒడిగట్టారని స్థానిక వార్తా చానళ్లు పేర్కొన్నాయి.
కత్తి పోట్లకు గురయిన తర్వాత నితిన్ సహాయం కోసం ఆర్థించి కుప్పకూలిపోయాడు. అయితే ఇది జాత్యంహకార హత్య అనడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదని హోమీసైడ్ స్వ్కాడ్ సీనియర్ సెర్జీంట్ డేవ్ స్నేర్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో స్పష్టంగా ఏమీ చెప్పలేమన్నారు. మృతుడి బంధువులకు విషయాన్ని తెలిపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి