సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: యాదవ్

ఆర్టీసి గురించి గానీ తన గురించి గానీ ఏదైనా రాసే ముందు తనను సంప్రదించాలని ఆయన మీడియాను కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే చార్జీల పెంపు విషయంలో తాను వ్యవహరించానని, బోర్డు నియమనిబంధనల మేరకే చార్జీలు పెంచామని ఆయన అన్నారు. పేదవారిపై భారం పడకుండా చార్జీలు పెంచినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసి తీవ్రమైన నష్టాల్లో ఉందని, నష్టాల నుంచి బయటపడడానికి చార్జీలు పెంచక తప్పలేదని ఆయన అన్నారు. హైదరాబాదులో ఆర్టీసి చార్జీలు ఢిల్లీలో చార్జీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, ఇక్కడ చార్జీలు ఎలా ఉన్నాయో చూడండని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వం ఆర్టీసికి ఏ విధమైన సహాయం చేయడం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications