విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్ వద్ద సముద్రంలో ఇద్దరు కోల్ కత్తా విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. కోల్ కత్తా నుంచి స్టడీ టూర్ కు వచ్చిన విద్యార్థులు బీచ్ కు వెళ్లి సముద్రంలో స్నానానికి దిగారు. వారిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అయితే ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటకు వచ్చారు. ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియడం లేదు. వారి కోసం వైమానిక దళ హెలికాప్టర్లు రెండు రంగంలోకి దిగాయి.
కోల్ కత్తా నుంచి 33 మంది విద్యార్థులు స్టడీ టూర్ కోసం విశాఖపట్నం వచ్చారు. వారంతా గత నాలుగు రోజులుగా వివిధ ప్రదేశాలను సందర్శించారు. శనివారం సాయంత్రం వారు కోల్ కత్తా వెళ్లిపోవాల్సి ఉంది. వెళ్లిపోయే సమయంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు కోల్ కత్తాలోని ఒక జియోలాజికల్ సంస్థకు చెందినవారని తెలుస్తోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి