వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై కేంద్ర ప్రకటన కోసం చూస్తున్నాం: హరీష్

తెలంగాణ వచ్చేదాక చట్ట సభలకు వెళ్లమని ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే టి.హరీష్‌రావులు చెప్పా రు. నిన్న మెదక్‌జిల్లా జోగిపేటలో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పులుగు కిష్టయ్య, నారాయణగౌడ్‌ల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని శనివారం సందర్శించి వారి ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేశారు.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ చివరిదశకు చేరుకున్నదని, ఉద్యమం రాజకీయ నాయకుల చేతుల్లోంచి విద్యార్థుల్లోకి చేరిందని, దానిని ఆపటం ఎవరితరం కాదని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమం ద్వారానే తాము చట్టసభలకు ఎన్నికయ్యామని, తెలంగాణ లేని పదవులు తమకెందుకని రాజినామాలు చేశామని పేర్కొన్నారు.