వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళనాడు పోలీసు సూపర్ బాస్ గా మహిళ

ప్రస్తుత డీజీపీ కేపీ జైన్ పదవీకాలం మరో మూడున్నర నెలలు మిగిలి ఉండగానే.. ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి నిర్ణయించుకోవడంతో కొత్త డీజీపీ నియామక చేపట్టటం చేపట్టారు. తిరునల్వేలి జిల్లాలో పట్టపగలు ఇద్దరు మంత్రుల సమక్షంలో ఓ ఎస్.ఐ. దారుణ హత్యకు గురైన సంఘటన నేపథ్యంలో డీజీపీ సెలవుపై వెళ్తున్నట్లు వెలువడిన ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇది మామూలుగా పెట్టిన సెలవేననీ, ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు. ఈ నిర్ణయం వెనక ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు జైన్ తిరస్కరించారు.