IPL 2026: అభిషేక్ కు బిగ్ టెన్షన్..! భారీ రికార్డుకు బుడ్డోడి ముప్పు ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో (IPL 2026)లో బౌలర్లకే కాదు బ్యాటర్లకూ బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా దిగుతున్న వైభవ్ సూర్యవంశీకి ఎలా బౌలింగ్ చేయాలో తెలియక బౌలర్లకు చుక్కలు కనిపిస్తుంటే.. స్టార్ బ్యాటర్లు తాము ఇప్పటికే సాధించిన రికార్డులన్నీ ఈ బుడ్డోడు తుడిచిపెట్టేస్తున్నాడనే టెన్షన్ లో ఉన్నారు. ఇదే క్రమంలో మరో అరుదైన రికార్డు బద్దలు కొట్టేందుకు వైభవ్ సిద్దమయ్యాడు.

DC vs RCB: ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు..! షాక్ లో అక్షర్ పటేల్..!
DC vs RCB: ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు..! షాక్ లో అక్షర్ పటేల్..!

ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఒక భారతీయ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్ల రికార్డు ఇప్పటివరకూ సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పేరు మీద ఉంది. అతను 2024 ఐపీఎల్ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌లలో 32.26 సగటు, 207.21 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు, ఇందులో 75* పరుగుల అత్యధిక స్కోరు కూడా ఉంది. ఆ టోర్నమెంట్‌లో అతను ఐపీఎల్లోనే 10వ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఈ సీజన్ లో 42 సిక్సర్లు కూడా కొట్టి టాప్ గా నిలిచాడు.

Vaibhav Sooryavanshi Could Shatter Abhishek Sharma s IPL Record This Season
IPL 2026: బుమ్రా కొనసాగింపుపై తేల్చేసిన పొల్లార్డ్..! నెక్ట్స్ మ్యాచ్ ల్లో..!
IPL 2026: బుమ్రా కొనసాగింపుపై తేల్చేసిన పొల్లార్డ్..! నెక్ట్స్ మ్యాచ్ ల్లో..!

ఇప్పుడు ఆ రికార్డు అధిగమించడానికి వైభవ్ సూర్యవంశీ కేవలం ఆరు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్తాన్ ఆడే మ్యాచ్‌లో సూర్యవంశీ ఈ భారీ సిక్సర్ల రికార్డును సాధించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో వైభవ్.. 44.44 సగటుతో, 238.09 స్ట్రైక్ రేట్‌తో 400 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉండగా, అతని అత్యధిక స్కోరు 103. అతను ఇప్పటివరకు 34 ఫోర్లు, 37 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు 15 ఏళ్ల వయసులో కేవలం 27 ఇన్నింగ్స్‌లలో 99 సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ... 20 ఏళ్లు నిండకముందే టీ20లలో ఒక బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్ల రికార్డు తన పేరుతో లిఖించుకున్నాడు. ఇప్పుడు మరో సిక్సర్ కొడితే 20 ఏళ్లు నిండకముందే వంద సిక్సర్లు కొట్టిన రికార్డును సూర్యవంశీ సొంతం చేసుకుంటాడు. బహుశా రాబోయే తరాలు కూడా ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+