రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ గుడ్ బై..ఆ టీంలోకి ఎంట్రీ..!?
IPL 2026: IPL సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పై బిగ్ అప్డేట్. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. తిరుగు లేదని భావించిన బౌలర్లకు చుక్కలు చూపించారు. అతి పిన్న వయసులో ఎలాంటి బెదరు లేకుండా బౌండరీకి తరలించటమే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్న తీరు క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఈ రాజస్థాన్ డైమండ్ పైన ఇతర జట్ల కన్ను పడింది. ఐపీఎల్ హాట్ టాపిక్ గా నిలిచిన వైభవ్ ఇక రాజస్ధాన్ రాయల్స్ లో ఉండటం కష్టంగానే కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఐపీఎల్ లో సంచలనంగా మారుతోంది.
ఐపీఎల్ 2025 సన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు వైభవ్ రాజస్థాన్ రాయల్స్ నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నా.. వచ్చే ఏడాది మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో వైభవ్ కోసం ఎంత ధర అయినా చెల్లించేందుకు ఫ్రాంచైజీలు సిద్దం అవుతున్నారు. ఇదే అంశం పైన ఇంగ్లాండ్ మాజీ పేసర్ ఇదే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాజస్థాన్ రాయల్స్ తన పోస్టర్ బాయ్‌ని కాపాడుకోవడం అంత సులువు కాదని వార్నింగ్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ వంటి భారీ జట్లు వైభవ్ సూర్యవంశీ కోసం గాలం వేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 14 ఏళ్ల వయసు ఉన్న కుర్రాడిని వేలంలో రూ 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ ను బ్రాడ్ అభినందించాడు. ఐపీఎల్ లో వైభవ్ ఆట తీరు అద్భుతమని చెబుతూనే.. ఐపీఎల్ లో ఏ ఆటగాడి తో నిరంతరం కొనసాగే విధంగా ఒప్పందం చేసుకోలేదని చెప్పుకొచ్చారు.

సూర్యవంశీ ఆట పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసలు
వచ్చే ఐపీఎల్ కు వైభవ్ ఒకవేళ వేలంలోకి వస్తే రూ.30 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని... ముంబై ఇండియన్స్ వంటి పెద్ద జట్లు అతడిని సొంతం చేసుకునేందుకు రెడీగా ఉంటాయని బ్రాడ్ విశ్లేషించారు. వైభవ్ అంటే ఇప్పుడు కేవలం ఒక యంగ్ ప్లేయర్ మాత్రమే కాదు. ఒక బాక్సాఫీస్ అట్రాక్షన్ గా అభివర్ణించారు. జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హాజల్‌వుడ్ వంటి ప్రపంచ మేటి బౌలర్లను ఎదుర్కొంటూ.. వారి బౌలింగ్‌లో మొదటి బంతికే సిక్సర్ బాదడం ఈ 15 ఏళ్ల కుర్రాడికే చెల్లిందని ప్రశంసించారు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ కూడా వైభవ్ ఆట పైన ప్రశంసలు కురిపించాడు. క్రిస్ గేల్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు 30 ఏళ్ల వయసులో ఎంత భయం లేకుండా ఆడారో, వైభవ్ 15 ఏళ్లకే అంత ధైర్యంగా ఆడుతున్నాడని చెప్పారు. ఒకవేళ వచ్చే వేలంలో వైభవ్ గనుక వేలంలోకి వస్తే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలుస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications