West Bengal Repolling: బెంగాల్లో దీదీకి షాక్..! రేపు మళ్లీ పోలింగ్ ...!

పశ్చిమ బెంగాల్లో (west bengal) గత నెల 29న జరిగిన రెండో దశ పోలింగ్ లో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలపై అందిన ఫిర్యాదుల మేరకు ఏకంగా 15 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు పంపింది. అదీ రేపే ఈ రీపోలింగ్ జరగబోతోంది. దీంతో ఆయా అస్ధానాల్లో అధికార టీఎంసీకి టెన్షన్ పెరుగుతోంది.

దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహట్ పశ్చిమ్ అసెంబ్లీ స్థానాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మగ్రాహట్ పశ్చిమ్‌లోని 11 బూత్‌లలో, డైమండ్ హార్బర్‌లోని నాలుగు బూత్‌లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కంచు కోట అయిన డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఫల్తాలో, ఈవీఎం బటన్లను టేపుతో ట్యాంపర్ చేశారని బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో ఈ రీపోలింగ్ జరగబోతోంది. ఈ బూత్‌లలో ఈవీఎం ట్యాంపరింగ్, బూత్ జామింగ్, రిగ్గింగ్ జరిగాయని ఆరోపిస్తూ ఓటర్లు, రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేశాయి.

West Bengal Repolling Tomorrow 15 Booths Confirmed Falta Stations Still in Limbo

ఫల్తా నియోజకవర్గంలోని మరో 30 బూత్‌లలో కూడా రీపోలింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశలో భాగంగా ఏప్రిల్ 29న ఈ బూత్ లలో పోలింగ్ జరిగింది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 58(2) కింద ఎన్నికల సంఘం ఇప్పుడు ఆ పోలింగ్‌ను రద్దు చేసింది. ఈవీఎంల పనిచేయకపోవడం, బూత్ క్యాప్చరింగ్, హింస లేదా ఎన్నికల నిష్పక్షపాతానికి భంగం కలిగించే విధానపరమైన ఉల్లంఘనలు వంటి తీవ్రమైన అవకతవకల వల్ల పోలింగ్‌కు ఆటంకం కలిగితే, ఆ బూత్‌లో పోలింగ్‌ను రద్దు చేసి, తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఆదేశించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. దీంతో ఈవీఎంలపై తమ అభ్యర్థులకు సంబంధించిన బటన్లను, వారి పేర్లను దాచిపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా టేపుతో కప్పివేశారని బీజేపీ ఆరోపించడంతో, రెండవ దశ పోలింగ్ వివాదాస్పదమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+