West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..!

పశ్చిమబెంగాల్లో (west Bengal) ఈసారి జరిగే రెండు దశల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్ లో ఘనవిజయం తర్వాత తమ తదుపరి లక్ష్యం బెంగాలే అని ప్రకటించిన ప్రధాని మోడీ..ఈ రాష్ట్రంలో ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికలు గెలిచేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. ఇలాంటి సమయంలో మ్యాట్రిజ్-అయాన్స్ నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్ లో (Matrize-IANS Poll) షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి.

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి మమతా బెనర్జీ (mamata Banerjee) అధికారంలోకి వస్తారని మాట్రిజ్-ఐఏఎన్‌ఎస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ తేల్చేసింది. అయితే ఈసారి అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీ తప్పదని తెలిపింది. తాజా సర్వే ప్రకారం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలోని 294 సీట్లలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) దాదాపు 155-170 సీట్లు గెలుచుకుంటుందని, బిజెపికి 100-115 సీట్లు లభిస్తాయని, ఎంఐఎంకు 5-6 సీట్లు లభిస్తాయని ఈ సర్వే అంచనా వేసింది.

Matrize-IANS Poll Mamata Banerjee Predicted for Fourth Consecutive Term in Bengal

గత ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి ఎదురైన గట్టి పోటీ ఎదుర్కొని మరీ 200పైగా సీట్లు సాధించింది. ఈసారి కూడా గెలిస్తే మమతా బెనర్జీ నాలుగోసారి సీఎం కావడం ఖాయం. అలాగే రాష్ట్రంలో మమతా బెనర్జీ పట్టు ఏమాత్రం సడలిపోలేదని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవే నిజమైతే ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బెంగాల్లో ఈసారి ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4న ఫలితాలు వెెలువడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+