West Bengal Election Schedule: రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ పోరు-ముఖ్య తేదీలివే..!
పశ్చిమ బెంగాల్ (west bengal) అసెంబ్లీకి గడువు తీరుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో దీన్ని విడుదల చేసారు. షెడ్యూల్ ప్రకారం ఈసారి పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో నిర్వహించబోతున్నారు. అనంతరం మే 4న మిగతా రాష్ట్రాలతో పాటు బెంగాల్లోనూ ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
294 సీట్లు ఉన్న పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. ఇందులో భాగంగా తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 30న వెలువడుతుంది. ఏప్రిల్ 6 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, 9న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్ 23న రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ నిర్వహిస్తారు. తొలి విడతలో 15 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

మరోవైపు రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 2న ఇస్తారు. ఏప్రిల్ 9 వరకూ రెండోవిడత ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం మే 5న రెండు విడతల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications