Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!

విజయనగరం జిల్లాలో తాజాగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram airport) రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం క్రెడిట్ ఎవరిదన్న దానిపై టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ ప్రాజెక్టు మా హయాంలో మొదలుపెట్టామని టీడీపీ, కాదు కాదు మేమే ప్రారంభించామని వైసీపీ వాదిస్తున్నాయి. దీంతో అసలు భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ తీసుకోవాల్సింది ఎవరో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వెల్లడించారు.

ఏపీలో ఉద్యోగుల జీతాలపై గుడ్ న్యూస్- ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు..!
ఏపీలో ఉద్యోగుల జీతాలపై గుడ్ న్యూస్- ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు..!

భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ కోసం వైసీపీ, టీడీపీ మధ్య జరుగుతున్న పోరాటంపై ఎక్స్ లో ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు.
భోగాపురం క్రెడిట్ కోసం కొట్టుకోవడం ఆపాలని ఇరు పార్టీలకు ఆయన సూచించారు. అసలు భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ దాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్ధది అని ఏబీవీ తేల్చేశారు. దీనికి ఆధారాలను కూడా ఆయన బయటపెట్టారు. అవసరమైనదానికంటే చాలా ఎక్కువగా 5000 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్లు వాస్తవం, భూములు కోల్పోయే వాళ్ల ఆందోళనలు వాస్తవం, ఆ ఆందోళనలకు అప్పట్లో ప్రతిపక్షం (వైసీపీ) సమర్ధన వాస్తవం, బలవంతాన, అతి కష్టం మీద భూమి పరిమితిని దాదాపు 3000 ఎకరాలకు కుదించడం వాస్తవం, ఎయిర్పోర్టు నిర్మాణానికి వేలం ద్వారా బిడ్లు ఆహ్వానించడం వాస్తవం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బిడ్డు గెలుచుకోవడం వాస్తవం, జీఎంఆర్ కోసం ఆ వేలాన్ని క్యాన్సిల్ చేయడం వాస్తవం అని ఏబీవీ తెలిపారు.

Bhogapuram Airport Credit Row AB Venkateswara Rao Weighs In On Chandrababu vs YS Jagan
అంబటి చిచ్చు..! నాకో న్యాయం, బోండాకో న్యాయమా ? ఏబీవీ ఫైర్..!
అంబటి చిచ్చు..! నాకో న్యాయం, బోండాకో న్యాయమా ? ఏబీవీ ఫైర్..!

అలాగే వేలం నిబంధనలని సవరించి తిరిగి వేలం వేయడం, ముందుగానే నిర్ణయించిన ప్రకారం జీఎంఆర్ కి అప్పజెప్పడం వాస్తవం, మొదలైన పనులను జగన్ ప్రభుత్వం ఆపించడం వాస్తవం, కాకినాడ సెజ్ లో జీఎంఆర్ వాటాలను అరబిందో కు అప్పజెప్పడంతో పాటు ఇంకొన్ని విషయాల్లో డీల్ కుదరటం వాస్తవం, 2023లో పనులు తిరిగి ప్రారంభించడానికి అనుమతించడం వాస్తవం, ఇప్పటి మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి పనులు వేగవంతం చేయడం వాస్తవం, కావలసిన సదుపాయాలు, కనెక్టింగ్ రోడ్లకు మన పేద రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కుమ్మరించడం వాస్తవం, బట్టల షాపింగ్ మాల్ లాంటి సంస్థ ప్రారంభానికి కోట్ల ఖర్చుతో ప్రభుత్వం హడావుడి వాస్తవం అని ఏబీవీ తేల్చేశారు.

Bhogapuram Airport Credit Row AB Venkateswara Rao Weighs In On Chandrababu vs YS Jagan
ప్రమాదాల్నీ కుట్రగా మార్చేస్తారా?- మీ ఎమ్మెల్యేల సంగతేంటి ? జగన్ ఫైర్..!
ప్రమాదాల్నీ కుట్రగా మార్చేస్తారా?- మీ ఎమ్మెల్యేల సంగతేంటి ? జగన్ ఫైర్..!

అలాగే 13వేల మందితో ధింసానృత్యాలు, 'అల భోగాపురంలో' అంటూ అస్మదీయ పత్రికల కేరింతలు వాస్తవం, విజయవాడ ఎయిర్ పోర్ట్ పనులు ఎక్కడివక్కడే, ఇన్నేళ్ళకూ డైలీ ఒక్క అంతర్జాతీయ సర్వీసూ లేకపోవడం, తేకపోవడం చేదు వాస్తవం అని ఏబీవీ తెలిపారు. వాట్సాప్ యుగంలో ప్రజల జ్ఞాపక శక్తి మీద అందరికీ చులకన, అందుకే ఒక వరుసలో గుర్తు చెయ్యడం ఇవన్నీ రికార్డు మీదున్న వాస్తవాలే, ఇప్పుడు నిర్ణయించుకోండి, భోగాపురం భోగం ఎవరిది, క్రెడిట్ ఎవరిది? అని ఏబీవీ ఇరు పార్టీలకు సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+