New Pension: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు గడువు పెంపు? సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ..!

ఏపీలో చాలా కాలం తర్వాత కొత్త పెన్షన్ల (New Pension) మంజూరుకు కూటమి సర్కార్ (AP Govt) సిద్దమైంది. ఈ మేరకు దరఖాస్తులు చేసుకోవాలని అర్హుల్ని కోరింది. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో భారీ ఎత్తున లబ్దిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. ఈ లోపే మరో చిక్కు వచ్చి పడింది.

ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తుదారులకు ఊరట- సర్కార్ మరో కీలక నిర్ణయం..! రేపటి నుంచి..!
ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తుదారులకు ఊరట- సర్కార్ మరో కీలక నిర్ణయం..! రేపటి నుంచి..!

ఎల్లుండి శనివారం నుంచి వరుసగా మూడు రోజులు ప్రభుత్వ సెలవులు వస్తున్నాయి. ఇందులో రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి ఉన్నాయి. కాబట్టి ఈ మూడు రోజుల ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో ఉండరు. కాబట్టి ఈ మూడు రోజుల్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు కూడా మూసి ఉంటాయి. అసలే దరఖాస్తులకు కావాల్సిన పత్రాల కోసం ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా తిరగాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి కావాలంటే ప్రభుత్వం ఇచ్చిన సమయం సరిపోదు. అందుకే ఇప్పుడు అర్హులైన దరఖాస్తుదారులు తమకు ఇచ్చిన గడువును పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

New pension applicants in AP seek extension beyond 16th amid continuous holidays
విజయవాడ- తిరుపతి విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కొత్త సర్వీసులు-షెడ్యూల్ ఇదే..!
విజయవాడ- తిరుపతి విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కొత్త సర్వీసులు-షెడ్యూల్ ఇదే..!

వాస్తవానికి ప్రభుత్వం కొత్త పెన్షన్ల దరఖాస్తుల కోసం ఇచ్చిన గడువు ఈ నెల 16న పూర్తవుతోంది. కానీ మధ్యలో సెలవులు రావడం వల్ల దరఖాస్తులు ఆలస్యం అవుతాయని, కాబట్టి మరో వారం రోజులు అయినా పొడిగింపు ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి పలు వినతులు అందుతున్నాయి. వీటిని పరిశీలించి సెప్టెంబర్ 16 లోపు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. గడువు ముగిసే లోపు మరో 2-3 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+