ఏపీలో కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం.. ! ప్రాసెస్, దరఖాస్తులు ఇలా..!

ఏపీలో కొత్తగా పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం (AP NTR Bharosa Pension ) కింద కొత్త పెన్షన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. దీని ప్రకారం అర్హులైన దరఖాస్తు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అనంతరం వాటిని క్షేత్రస్ధాయిలో పరిశీలించి, అర్హులైన వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయబోతున్నారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్తగా పెన్షన్లు (Pensions) కావాలనుకునే వారు స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత/చేనేత కార్మికులు, మత్స్యకారులు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 7 నుండి దరఖాస్తుల స్వీకరణ, ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారు తమకు సంబంధించిన స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన తరువాత నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం అర్హతను పరిశీలిస్తారు. కొత్త పింఛన్ దరఖాస్తుల ప్రక్రియలో పారదర్శకతతో పాటు వేగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి దశకు స్పష్టమైన గడువు నిర్ణయించింది.

• సెప్టెంబర్ 7-16: దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ధృవీకరణ.
• సెప్టెంబర్ 17-21: సాధారణ అర్హత పరిశీలన.
• సెప్టెంబర్ 22-24: భౌతిక, శాఖాపరమైన ధృవీకరణ, అర్హత నిర్ణయం, సిఫారసు.
• సెప్టెంబర్ 25-26: సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ.
• అన్ని స్థాయిల్లో పరిశీలన పూర్తయిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా పింఛన్లు మంజూరు చేస్తారు.

AP NTR Bharosa Pension Applications Begin Check How to Apply

అన్ని కేటగిరీలకు సాధారణంగా ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి అవసరమైన ప్రత్యేక ధృవపత్రాలను సమర్పించాలి.
• వృద్ధాప్య పింఛన్: వయస్సు నిర్ధారణకు ఆధార్.
• వితంతు పింఛన్: భర్త మరణ ధృవపత్రం, భర్త ఆధార్ నంబర్.
• ఒంటరి మహిళ: వివాహిత అయితే కోర్టు/అదాలత్ విడాకుల డిక్రీ; అవివాహిత అయితే తహసీల్దార్ జారీ చేసే వివాహం కాని ధృవపత్రం.
• దివ్యాంగుల పింఛన్: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌మార్క్ దివ్యాంగత్వాన్ని నిర్ధారించే SADAREM ధృవపత్రం.
• చేనేత కార్మికులు: చేనేత మరియు జౌళి శాఖ ధృవపత్రం.
• మత్స్యకారులు: మత్స్య శాఖ ధృవపత్రం.
• డప్పు కళాకారులు: సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం.
• సంప్రదాయ చెప్పుల తయారీదారులు: సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం.
• కల్లుగీత కార్మికులు: నిషేధ మరియు ఎక్సైజ్ శాఖ ధృవపత్రం.
• ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులు: జిల్లా వైద్య మండలి ధృవపత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+