నెవర్ బిఫోర్ హారర్ థ్రిల్లర్.. ప్రశాంత్ నీల్ సమర్పణలో.. ఆ రోజు నుంచే థియేటర్లలోకి

పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న హారర్ సినిమా '418' ఎట్టకేలకు సెన్సార్ బోర్డు అడ్డంకులను అధిగమించింది. ఈ సినిమాలో హారర్ సీన్లు అధికంగా ఉన్నాయంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం తెలపింది. దాంతో చిత్ర మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే రివైజింగ్ కమిటీ ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అంటే ఈ మూవీని 18 సంవత్సరాలు పై బడిన వారు మాత్రమే చూసే అవకాశం ఉంది. అందుకు కారణం 418 సినిమాలో అధికంగా హార్రర్ సీన్స్ ఉండటమే. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కీర్తన్ నందగౌడ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

418 మూవీలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతీ పగడాల కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కీర్తన్ నందగౌడ ఇప్పుడు ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ప్రశాంత్ నీల్ టీమ్ నుంచి రాబోతున్న దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాక ఓ హారర్ సినిమాలో హారర్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడం కూడా ఇప్పుడు సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసింది. హారర్ సినిమాలో హారర్ సీన్స్ కాకుండా మరి ఏం ఉంటాయని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఈ మూవీ ఏమాత్రం ప్రేక్షకుల్ని భయపెడుతుందో చూడాలని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

418 Prashanth Neel movie censor formalities finally complete the release is set for September 18

ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే మూవీ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత సలార్ 2, కేజీఎఫ్ 3 చిత్రాలు ప్రశాంత్ నీల్ చేయాల్సి ఉంది. మరి ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న 418 మూవీ సెప్టెంబర్ 18 న ఏమాత్రం ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+