రూపాయి కట్టకుండానే దేశంలోనే తొలిసారి ఉద్యోగులకు కోటి రూపాయల బీమా!
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ దారుల కోసం అనేక పథకాలని అందిస్తోంది తెలంగాణా సర్కార్. ఇటీవల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త ఈహెచ్ఎస్ పథకం అందించిన ప్రభుత్వం వారి ఆరోగ్య రక్షణకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు పెద్ద పీటే వేసింది. ఇక తాజాగా ఉద్యోగులు ప్రమాద వశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించే పథకం అందించటానికి శ్రీకారం చుట్టింది.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనుదారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది. ఉద్యోగుల కుటుంబాలకు కష్ట కాలంలో ఆర్ధిక భరోసా ఇవ్వటం కోసం జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో ఈ స్కీమ్ ను ఉద్యోగులకు తాము అందిస్తున్నామన్నారు. ఈ పథకంలో భాగంగా 16 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా 12.91 మిలియన్ల మందికి లబ్ది చేకూరుతోందన్నారు. ఈ పాలసీ కింద ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయలు, విమాన ప్రమాదాల్లో మరణిస్తే రెండు కోట్లు, సాధారణ మరణానికి పది లక్షల రూపాయలు వరకు పరిహారం అందుతుందని పేర్కొన్నారు.
దీనితో ఉద్యోగులకు ఆర్థిక, వైద్య భద్రతను కల్పిస్తున్నట్లు వివరించారు. ఈలో పథకం లో మొత్తం సుమారు 12.91 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 5.18 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 5 లక్షల మంది తాత్కాలిక, కాంట్రాక్ట్ కార్మికులు, 2.72 లక్షల మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ఉన్నారు. ఈ పథకాన్ని మొదట్లో 2024 ఫిబ్రవరిలో సింగరేణి ఉద్యోగులకు ప్రవేశపెట్టారు.
తర్వాత ఎనర్జీ శాఖకు విస్తరించి, ఇప్పుడు విస్తృతంగా అమలు చేస్తున్నారు. ప్రమాదాల్లో మరణం లేదా గాయాలు సంభవించినప్పుడు లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఇది అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పథకం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ప్రమాదాల నుంచి ఆర్థికంగా రక్షణ పొందుతారన్నారు.












Click it and Unblock the Notifications
