పెళ్లి చేసుకోవడం వేస్ట్.. కుక్కను పెంచుకోవడమే బెస్ట్ - తెలుగు బ్యూటీ
స్వాతి.. ఈ తెలుగు అమ్మాయి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. 'కలర్స్' ప్రోగ్రామ్ ద్వారా యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకొని.. ఆ తర్వాత నటిగా మారారు. 'డేంజర్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. 'అష్టాచమ్మా' మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 'కలవరమయే మదిలో', 'గోల్కొండ హైస్కూల్', 'స్వామిరారా', 'బంగారు కోడిపెట్ట', 'కార్తికేయ', 'త్రిపుర', 'లండన్ బాబులు', 'పంచతంత్రం', 'మంత్ ఆఫ్ మధు' వంటి తెలుగు చిత్రాలతో ఫాలోయింగ్ పెంచుకున్నారు. కాగా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలతోనూ సత్తా చాటారు.
కాగా కెరీర్ పీక్స్‌లో ఉండగానే వికాస్ వాసు అనే యువకుడిని ప్రేమవివాహం చేసుకున్నారు. 2018 ఆగస్టు పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. అయితే కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో భర్తతో ఉన్న ఫోటోలు, వీడియోలను తొలగించడంతో స్వాతి-వికాస్‌లు విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఈ వార్తలను ఆమె ఖండించారు. ఈ క్రమంలోనే స్వాతి వివాహానికి ముందు ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్యాభర్తల సంబంధంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

నేను అదే చేస్తా..
ఈ మేరకు యాంకర్ ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయని అడగ్గా.. స్వాతి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అబ్బాయిలకి కొంతమంది అమ్మాయిలు 'ఐ లవ్ యూ' అని చెబితే పడిపోతారని.. మరికొంతమంది పెళ్లి చేసుకుంటాను అంటే పడిపోతారని తెలుసన్నారు. తన విషయంలో కూడా హోమ్లీ గర్ల్‌ని, తెలుగు అమ్మాయిని కాబట్టి 'ఐ విల్ మ్యారీ యూ.. విల్ యూ మ్యారీ మీ' అని అడుగుతారని ఓపెన్ అయ్యారు. అందుకే తాను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానని వెల్లడించారు.
అంతే కాకుండా తాను చాలా పెళ్లిళ్లను చూశానని.. పబ్లిక్‌లో ఎక్కువగా నటిస్తుంటారని.. ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నట్లుగా ఉంటారన్నారు. తాను మాత్రం కుక్కపిల్లను పెంచుకుంటూ.. అమ్మానాన్నల్ని చూసుకుంటానని.. చివరి వరకు వాళ్లతోనే ఉంటాను" అని తెలిపారు. అయితే ఆ తర్వాత తల్లిదండ్రులు "ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరిగిపోవాలని" తనకు తరచుగా చెప్పేవారని, దీంతో సరేనని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని స్వాతి గుర్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications