మెదక్: చిరంజీవి తన వ్యవహార శైలిని మార్చుకోకుండా ఉంటే తెలంగాణ ప్రజలు తిత్తి తీస్తారని మెదక్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి హెచ్చరించారు. మెదక్ జిల్లా,గజ్వేల్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టిడిపి రాష్ట్ర నాయకుడు బూర్గుపల్లి ప్రతాపరెడ్డికి సంఘీభావం ప్రకటించిన సందర్భంగా విజయశాంతి ప్రసంగించారు. సామాజిక తెలంగాణ ఏర్పాటు పేరుతో తెలంగాణాలో తిరిగిన చిరంజీవి సమైఖ్యవాదాన్ని వల్లించడం సమంజసం కాదన్నారు. తెలంగాణలో పీఆర్పీ దుకాణాన్ని ప్రజలు మూసివేసిన కారణంగానే చిరంజీవి సమైఖ్యవాదాన్ని వల్లివేస్తున్నట్లు విమర్శించారు. తెలంగణ ఉద్యమకారులు రాళ్ళు రువ్వితేనే హత్యానేరం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు మరి రిలియన్స్ పై జరిగిన దాడులను పట్టించుకోకపోవడం సిగ్గు చేటని ఆమె పేర్కొన్నారు.